అందాల భామ సమంత ఏ సినిమాకైన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆమె నటనాచాతుర్యం, అందమైన నవ్వు, మత్తెక్కించే చూపులు సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ లక్షణాలే బాక్స్ ఆఫీస్ దగ్గర సమంత నెలకొల్పిన రికార్డులను చెక్కుచెదరనివ్వకుండా చేసాయి. మరోసారి ఈ భామ ‘అత్తారింటికి దారేది’ సినిమాలో సుకుమారమైన, సున్నితమైన పాత్ర పోషించనుంది. ఈ పాత్ర ఆమెకు చాలా నచ్చిందట
సమంత తన కెరీర్ లో మొదటిసారిగా పవన్ కళ్యాన్ వంటి స్టార్ హీరో సరసన నటించింది. ఈ సినిమా ఆగష్టు 7 న విడుదలకానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు
ఇప్పటికే ‘అత్తారింటికి దారేది’ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సమంత అభిమానులకు మరోసారి ఈ సినిమా పండగే అని చెప్పాలి