వేగంగా జరుగుతున్న అత్తారింటికి దారేది పోస్ట్ ప్రొడక్షన్

వేగంగా జరుగుతున్న అత్తారింటికి దారేది పోస్ట్ ప్రొడక్షన్

Published on Jul 22, 2013 8:50 AM IST

Atharintiki-Dharedhi-4

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చాలా వేగంగా పూర్తవుతున్నాయి. ఈ సినిమాని ఆగష్టు 7న రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. అనుకున్న సమయానికి పూర్తి కావాలని ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఎంతో కష్టపడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నటీనటులు ఈ సినిమా డబ్బింగ్ వర్క్ పూర్తి చేసారు.

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో పవన్ కళ్యాణ్ సరసన మొదటి సారి సమంత జోడీ కట్టగా, ప్రణిత సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. పూర్తి వినోదాత్మకంగా ఉంటుందంటున్న ఈ సినిమాపై డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా నమ్మకంగా ఉన్నాడు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు.

తాజా వార్తలు