డైరెక్టర్ గా మారుతున్న కమెడియన్

డైరెక్టర్ గా మారుతున్న కమెడియన్

Published on Jul 21, 2013 8:05 PM IST

Srinivas A

‘అష్టా చమ్మా’ సినిమాతో తెలుగు వారికి పరిచయమైన శ్రీనివాస్ అవసరాల ఆతర్వాత కమెడియన్ గా, సహాయ నటుడు పాత్రల్లో మెప్పించాడు. ఇప్పుడు తను మెగాఫోన్ పట్టుకొని డైరెక్టర్ గా మారనున్నాడు. ఈ సినిమాని ‘అందాల రాక్షసి’, ‘ఈగ’ సినిమాలు తీసిన వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రాపాటి నిర్మించనున్నాడు. ఈ సినిమాలో మూడు కీలక పాత్రలు ఉంటాయి. ట్రై యాంగిల్ లవ్ స్టొరీగా ఉంటుందని ఆశిస్తున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తారు. ఇటీవలే ‘సుకుమారుడు’, ‘చమ్మక్ చల్లో’ సినిమాల్లో కనిపించిన శ్రీనివాస్ అవసరాల త్వరలోనే ‘అంతకముందు ఆ తరవాత’, గుణ్ణం గంగరాజు తీస్తున్న ‘చందమామలో అమృతం’ సినిమాల్లో కనిపించనున్నాడు. గతంలో కొన్ని స్క్రిప్ట్స్ రాసుకున్న శ్రీనివాస్ 5 సంవత్సరాల తర్వాత నటుడయ్యాడు. తాజాగా దర్శకుడిగా మారి తొలిసినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు.

తాజా వార్తలు