మళ్ళీ మెగాఫోన్ పట్టుకోనున్న తమ్మారెడ్డి

మళ్ళీ మెగాఫోన్ పట్టుకోనున్న తమ్మారెడ్డి

Published on Jul 21, 2013 12:10 PM IST

Tammareddy-Bharadwaja

ఒక డైరెక్టర్ గా, నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజ అందరికీ తెలుసు. ఆయన చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్ళీ డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టుకోనున్నాడు. ఆ సినిమాకి ‘ప్రతిఘటన’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో హీరోయిన్ చార్మీ నటిస్తుండగా అందరికీ బాగా తెలిసిన బాలీవుడ్ నటుడు అతుల్ కులకర్ణి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో చార్మీ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టుకోనున్న ఈ సినిమాని సింగల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలని తమ్మారెడ్డి ప్లాన్ చేస్తున్నారు.

‘ప్రతిఘటన’ పేరుతో 1986 లో ఓ పాపులర్ సినిమా వచ్చింది. ఆ సినిమాలో విజయశాంతి ప్రధాన పాత్రలో నటించగా టి. కృష్ణ దర్శకత్వం వహించాడు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటి మోడ్రన్ తరానికి చెందిన ‘ప్రతిఘటన’ చార్మీకి హెల్ప్ అవుతుందా? అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే..

తాజా వార్తలు