నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని హెచ్ఐసిసి, నవోటల్ లో జరిగిన 60 వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ లో టాప్ అవార్డ్స్ ని ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ”ఈగ”, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ”గబ్బర్ సింగ్” సినిమాలు కైవసం చేసుకున్నాయి. ఈగ, గబ్బర్ సింగ్, బిజినెస్ మాన్, జులాయి, రచ్చ, ఇష్క్, ఢమరుకం సినిమాలు కూడా పలు విభాగాల్లో నామినేట్ అవ్వగా అన్నిటి కంటే ఎక్కువ మరియు కీలకమైన అవార్డ్స్ ని ఈగ, గబ్బర్ సింగ్ సినిమాలు దక్కించుకున్నాయి. ఈగ చిత్రానికి గాను ఎస్ ఎస్ రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు అందుకున్నారు, అలాగే ఈగ మూవీకి ఉత్తమ చిత్రం, బెస్ట్ హీరోయిన్ (సమంత), ఉత్తమ సహాయ నటుడు (సుదీప్), బెస్ట్ విఎఫ్ఎక్స్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాకి గాను బెస్ట్ హీరో అవార్డు సొంతం చేసుకున్నారు, అలాగే గబ్బర్ సింగ్ సినిమాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్(దేవీశ్రీ ప్రసాద్), బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (వడ్డేపల్లి శ్రీనివాస్) అవార్డ్స్ వచ్చాయి. రైతుల దృష్ట్యా రామ్ చరణ్ అవార్డు అందుకున్నాడు. బాపు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన ఈ వేడుకలో శృతి హాసన్, తదితర తారలు తమ డాన్సులతో అలరించారు. ఎఆర్ రెహమాన్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా, ధనుష్, అనిరుధ్ రవిచందర్, శృతి హాసన్, తమన్నా, యామి గౌతం, అల్లు శిరీష్, అమలా పాల్, ప్రియమణి, లక్ష్మీమంచు, నిఖీషాపటేల్,కృతి కర్భంద, చార్మీ తదితరులు ఈ వేడుకకి హాజరయ్యారు.
ఫిల్మ్ ఫేర్ లో టాప్ అవార్డ్స్ కొట్టేసిన ఈగ, గబ్బర్ సింగ్
ఫిల్మ్ ఫేర్ లో టాప్ అవార్డ్స్ కొట్టేసిన ఈగ, గబ్బర్ సింగ్
Published on Jul 21, 2013 10:23 AM IST
సంబంధిత సమాచారం
- ఇళయరాజా ఎఫెక్ట్.. ఓటిటి నుంచి అజిత్ సినిమా తొలగింపు!
- సోషల్ మీడియాని షేక్ చేసిన ‘ఓజి’ కొత్త స్టిల్స్!
- “కాంతార” ట్రైలర్ ఇంకెప్పుడు? ఇందుకే ఆలస్యం?
- నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్.. ఈసారి అలాంటిదా..?
- ఇంటర్వ్యూ : నిర్మాత రామాంజనేయులు జవ్వాజి – ‘భద్రకాళి’ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్
- ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్!
- ‘లిటిల్ హార్ట్స్’కు మహేష్ ఫిదా.. అతడికి సాలిడ్ ఆఫర్..!
- హైప్ తగ్గించుకోండి.. ‘ఓజి’లో ఈ సీన్స్ లేవు!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన క్రికెట్ రాణులు
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన క్రికెట్ రాణులు