హైదరాబాద్ శరవేగంగా సాగుతున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ షూటింగ్

హైదరాబాద్ శరవేగంగా సాగుతున్న కొరియర్ బాయ్ కళ్యాణ్ షూటింగ్

Published on Jul 20, 2013 2:30 PM IST

COURIER-BOY-KALYAN-2
నితిన్, యామి గౌతం జంటగా నటిస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్ ‘ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. గత నెలలో హైదరాబాద్లో వీరిద్దరి మధ్యా ఒక పాటను చిత్రీకరించారు . కొన్ని రోజుల క్రితం నితిన్ పై ఒక ప్రత్యేకమైన మందుపాటను తీసారు. ప్రస్తుతం ఒక పాటను హైదరాబాద్లో హీరో హీరోయిన్ల నడుమ తీస్తున్నారు. “మరో పాటను ఈరోజే మొదలుపెట్టాం.ఈ అందమైన పాటను విష్ణుదేవా మాస్టర్ ఇంకా అందంగా కోరియోగ్రాఫ్ చేస్తున్నారని” నితిన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ఇప్పటికే చాలా శాతం చిత్రీకరణ పూర్తయింది. . ప్రేమ సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మరో దర్శకుడు గౌతం మీనన్ ఫోటాన్ కథాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇదే సినిమాను తమిళ్ లో జై, యామి గౌతం నడుమ తీస్తున్నారు. కార్తీక సంగీతం అందించాడు. ఈ సినిమా బృందాన్ని గౌతం మీనన్ అభినందించాడు. ‘కొరియర్బాయ్ కళ్యాణ్ ‘ ఆసక్తికరంగా సాగే ఒక రొమాంటిక్ కామెడి సినిమా. ఈ ఏడాదిలో ఈ సినిమా విడుదలవుతుంది

తాజా వార్తలు