పవన్ అబిమానులకు నిర్మాత విజ్ఞప్తి

పవన్ అబిమానులకు నిర్మాత విజ్ఞప్తి

Published on Jul 18, 2013 1:04 PM IST

Atharintiki Dharedhi (6)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమా ఆడియోని రేపు శిల్ప కళావేదికలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ పాస్ లకు హైడిమాండ్ ఏర్పడింది. కానీ కొన్ని సెక్యూరిటి కారణాల వల్ల అంతమందికి పాస్ లను ఇవ్వడం సాద్యం కాదు. ఈ పాస్ లను ఇవ్వడానికి కొన్ని ప్రత్యేక పద్దతులను అవలంబిస్తున్నారు. ఫంక్షన్ వద్దకి ఎక్కువ సంఖ్యలో అబిమానులు వస్తే అనుకోని సంఘటనలు జరిగే ప్రమాదం ఉండడంతో నిర్మాత ఫాన్స్ కి ఈ విదంగా తెలియజేశాడు. “పవన్ కళ్యాణ్ ఆడియో లాంచ్ కి రాష్ట్ర అంతటి నుండి చాలా మంది అబిమానులు వస్తారు. మేము అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, మీ దగ్గర పాస్ లేక పొతే మీరు ఇక్కడకు రావద్దు. ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుంది. పాస్ లేకుండా ఎట్టి పరిస్థితిలోను లోపలికి అనుమతించారు” అని నిర్మాత ట్వీట్ చేశాడు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి సీట్లు ఎన్ని ఉన్నాయో అన్ని పాస్ లను మాత్రమే జారి చేయడం జరిగింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

తాజా వార్తలు