వెంకీ – రామ్ లు రామ్ – బలరాంలుగా రానున్నారా?

వెంకీ – రామ్ లు రామ్ – బలరాంలుగా రానున్నారా?

Published on Jul 18, 2013 8:15 AM IST

venkatesh-and-ram
విక్టరీ వెంకటేష్ – యంగ్ హీరో రామ్ హీరోలుగా నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమాకి రకరకాల టైటిల్స్ అనుకుంటున్నారు. ఇది వరకు ఈ సినిమాకి ‘గోల్ మాల్’ అనే టైటిల్ ని నిర్ణయించారు. తాజాగా ఈ సినిమాకి ‘రామ్ – బలరాం’ అనే టైటిల్ ఎంచుకున్నట్లు సమాచారం. ఈ విషయం పై ప్రొడక్షన్ టీం ఇంకా చివరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ బాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో అంజలి, షాజన్ పదమ్సీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని స్రవంతి రవి కిషోర్ – డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ టైటిల్ గురించి మీరేమంటారు ఫ్రెండ్స్.. ‘రామ్ – బలరాం’ టైటిల్ మీకు నచ్చిందా?

తాజా వార్తలు