నా రాకుమారుడిగా నవీన్ చంద్ర

నా రాకుమారుడిగా నవీన్ చంద్ర

Published on Jul 18, 2013 2:45 AM IST

Naveen_Chandra
‘అందాల రాక్షసి’ సినిమాలో నటించిన నవీన్ చంద్ర త్వరలో ‘నా రాకుమారుడు’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. రితూ వర్మ హీరోయిన్. టి. సత్య దర్శకుడు. ఈ సినిమాను హరివిల్లు క్రియేషన్స్ బ్యానర్ పై పి. వాజ్ రంగ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పుర్తికావచ్చింది. ఫస్ట్ లుక్ ఈరోజు విడుదలయ్యింది. అచ్చు సంగీత దర్శకుడు. కుమారస్వామి సినిమాటోగ్రాఫర్. మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు. ఈ సినిమా కాకుండా నవీన్ చంద్ర ‘దళం’ సినిమాలో కనిపించనున్నాడు. రీతూ వర్మ ‘అనుకోకుండా’ అనే ఒక లఘు చిత్రం ద్వారా పరిచయమయ్యి, ‘బాద్ షా’లో చిన్న పాత్ర పోషించింది. ఈమె తదుపరి సినిమా ‘ప్రేమ ఇష్క్ కాదల్’

తాజా వార్తలు