పవర్ స్టార్ మూవీతో రానున్న ప్రణిత

పవర్ స్టార్ మూవీతో రానున్న ప్రణిత

Published on Jul 4, 2013 9:30 PM IST

Pranitha-and-Pawan
కొంత కాలం క్రితం ‘బావ’, ‘శకుని’ సినిమాలతో తెలుగు వారికి పరిచయమైన భామ ప్రణిత సుభాష్. ఆ సినిమాలతో హిట్ అందుకోలేకపోయిన ఈ భామ ఈ సారి బాగా పవర్ఫుల్ గా ఉండే సినిమాతో ప్రేక్షుకుల ముందుకు రావడానికి సిద్దమవుతోంది. ఇప్పటి వరకు మూడు తెలుగు సినిమాల్లో కనిపించిన ఈ భామ బాక్స్ ఆఫీసు వద్ద మాత్రం పరాజయన్నే మూట గట్టుకుంది. కానీ తన మొదటి సినిమా నుంచి గ్లామరస్ లుక్ తో ఆకట్టుకున్నా సక్సెస్ మాత్రం రాలేదు.

కానీ ప్రస్తుతం ప్రణిత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటిస్తుండడంతో ఇక నుంచి ఆమె లక్ మారిపోతుందని ఆశిస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ప్రణిత ఓ కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ సందర్భంగా తనకి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. ‘పవన్ – త్రివిక్రమ్ గారితో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు చాలా సింపుల్ గా పెద్ద స్టార్స్ అని కాకుండా ఉంటారు. అలాగే వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని’ తెలిపింది.

‘అత్తారింటికి దారేది’ సినిమాలో కాకుండా మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ లు నటిస్తున్న సినిమాలో కూడా నటిస్తోంది. తెలుగు కాకుండా కన్నడలో నటించిన ‘విజిల్’ సినిమా వచ్చే వారం రిలీజ్ కానుంది. అలాగే కన్నడలో ఉపేంద్ర హీరోగా నటించనున్న ‘ భీమ’ సినిమాలో కూడా నటించనుంది. తెలుగు, కన్నడలో పెద్ద చిత్రాలు చేతిలో ఉన్న ప్రణితకి ఈ సంవత్సరం అన్నా లక్ కలిసి రావాలని కోరుకుందాం..

తాజా వార్తలు