పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అత్తారింటికి దారేది’. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకావడంతో ఈ చిత్రానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నారు. ఈ మూవీకి యొఉన్ తరంగ్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీవీశ్రీ రేపటి నుంచి ఈ చిత్రానికి సంబందించిన రీ రికార్డింగ్ పనులను మొదలు పెడుతున్నాడు. రెండు రోజుల క్రితమే ఈ చిత్ర యూనిట్ యూరప్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఇండియాకి వచ్చింది. ఇంకా ఒక సాంగ్, 5 రోజుల టాకీ పార్ట్ మాత్రమే బాలన్స్ ఉంది.
పవన్ కళ్యాణ్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉంటూ సాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ‘జల్సా’ తర్వాత పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ని ఆగష్టు 7న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి ప్లాన్ చేస్తున్నారు.