మరో రెండు రోజుల్లో చరణ్ జంజీర్ ట్రైలర్

మరో రెండు రోజుల్లో చరణ్ జంజీర్ ట్రైలర్

Published on Jul 3, 2013 6:50 PM IST

ram-charan-priyanka-chopra
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ సినిమా ‘జంజీర్’. ఈ సినిమా హిందీ ట్రైలర్ ని ఈ శుక్రవారం రోజున అధికారికంగా విడుదల చేయనున్నారు. నిర్మాతలు పునీత్, సుమీత్ లు ఈ సినిమా ట్రైలర్ విడుదలకు కావలసిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమా విషయంలో మెహ్ర బ్రదర్స్ మద్య గల వివాదం తొలగిపోయినట్లు ఉంది. ఈ సినిమాని నిర్మాతలు సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో చరణ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ నటిస్తోంది. ఓల్డ్ వెర్షన్లో ప్రణ్ పోషించిన పాత్రని ఇందులో సంజయ్ దత్ పోషించాడు. ఈ సినిమాకి అపూర్వ లఖియా డైరెక్టర్.

తాజా వార్తలు