అలియాస్ జానకి రిలీజ్ డేట్

అలియాస్ జానకి రిలీజ్ డేట్

Published on Jul 3, 2013 3:57 PM IST

alias-janaki
మెగా ఫ్యామిలీ నుంచి పరిచయం అవుతున్న మరో హీరో వెంకట్ రాహుల్. వెంకట్ రాహుల్, అనిష అంబ్రోసే జంటగా నటించిన సినిమా ‘అలియాస్ జానకి’. ఈ సినిమాని జూలై 19న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ బ్యానర్ లో అసోషియేట్ గా పనిచేసిన దయా ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాని సంఘమిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై నీలిమ తిరుమల శెట్టి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సిస్టంకి వ్యతిరేఖంగా న్యాయం కోసం పోరాడే ఓ కామన్ మాన్ కథే ఈ సినిమా. వెంకట్ రాహుల్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి బందువు కానీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో నీలిమ తిరుమల శెట్టి, దయాలు మేము అతన్ని మా సినిమా కోసం ఓకే చేసుకునేంత వరకూ మాకు తనెవరు అనేది తెలియదని చెప్పారు. ఈ సినిమా ఆడియో కి మంచి రెస్పాన్స్ తెచ్చుకొని ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఆల్బమ్స్ లో ఒకటిగా నిలిచింది. శ్రవణ్ మ్యూజిక్ కపోజ్ చేసిన ఈ మూవీకి సుజిత్ సరంగ్ సినిమాటోగ్రాఫర్.

తాజా వార్తలు