చివరి దశలో ఉన్న’గోల్ మాల్’ షూటింగ్

చివరి దశలో ఉన్న’గోల్ మాల్’ షూటింగ్

Published on Jul 3, 2013 12:38 PM IST

venkatesh-and-ram

విక్టరీ వెంకటేష్, రామ్ హీరోలు నటిస్తున్నమల్టీ స్టారర్ సినిమా ‘గోల్ మాల్’. ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతోంది. రెండు పాటలు మినహా ఈ సినిమా షూటింగ్ మొత్తం ముగిసింది. అంజలి, షాజన్ పదమ్సీ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి విజయ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ బచ్చన్, అజయ్ దేవగన్ నటించిన ‘బోల్ బచ్చన్’ సినిమా రీమేక్ గా వస్తున్న ‘గోల్ మాల్’ సినిమాని స్రవంతి రవి కిషోర్, డి. సురేష్ బాబు కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని తెలుగు నేటివిటికి తగిన విదంగా మార్పులు చేసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని విజయ్ భాస్కర్ చాలా వేగంగా తీయడాన్నిచూసి దీనిలో నటిస్తున్న వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా బృందం అతి త్వరలో ఒక పాటని షూట్ చేయడానికి అబ్రాడ్ వెళ్లనుంది. అక్కడ రామ్ -షాజన్ పదమ్సీ, వెంకటేష్ – అంజలి పై పాటను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు సంబందించిన మరింత సమాచారాన్ని త్వరలో మీకు తెలియజేస్తాం. ఈ సినిమా ఈ సంవత్సరం చివర్లో విడుదలయ్యె అవకాశం ఉంది.

తాజా వార్తలు