మరో కొత్త కంపెనీకు ప్రచారకర్తగా కాజల్

మరో కొత్త కంపెనీకు ప్రచారకర్తగా కాజల్

Published on Jul 2, 2013 4:00 PM IST

Kajal
బాలీవుడ్ కధనాల ప్రకారం కాజల్ ను మరొక కొత్త కంపెనీ ప్రచారకర్తగా ఎన్నుకున్నారు. కెవిన్ కేర్ గ్రూప్ కు సంభందించిన గ్రీన్ ట్రెడ్స్ సలూన్ కు ప్రచారకర్తగా ఆమె సంతకం చేసింది. ఈ భామ ఇప్పటికే లక్స్, బ్రూ మరియు కోల్గేట్ వంటి కంపెనీలకు ప్రచారం చేస్తుంది. ఈ కొత్త కంపెనీ ఒప్పందం ఇంకా అధికారికంగా వెల్లడించాల్సివుంది. ప్రస్తుతం కాజల్ లండన్ లో కుటుంబసభ్యుల నడుమ సేదతీరుతుంది. ఆ తరువాత అమెరికా వెళ్లనుంది. అక్కడనుండి వచ్చిన తరువాత విజయ్, కార్తీల సినిమాల లో నటిస్తుంది. కాజల్ రామ్ చరణ్ సరసన నటించిన ‘ఎవడు’ సినిమా జూలై 26న విడుదలకానుంది

తాజా వార్తలు