సిద్దార్థ్ నాకో మంచి ఫ్రెండ్ మాత్రమే అంటున్న సమంత

సిద్దార్థ్ నాకో మంచి ఫ్రెండ్ మాత్రమే అంటున్న సమంత

Published on Jul 2, 2013 8:48 AM IST

Samantha

గత కొద్ది నెలలుగా సిద్దార్థ్ – సమంత మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఎంటా అని అటు మీడియాలో, ఇటు అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వారిద్దరూ రియల్ లైఫ్ లో ఉంటున్న విధానాన్ని బట్టి వారు ఒక రొమాంటిక్ రిలేషన్ లో ఉన్నారని తెలిసింది. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ సమంత షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ వార్తని ఓ ప్రముఖ పత్రిక వారు ప్రచురించారు.

‘ సిద్దార్థ్ నాకొక మంచి స్నేహితుడు. అంతకు మించి మా ఇద్దరిమధ్యలో ఇంకేమీ లేదు. నాకు అతనితో ఎలాంటి రొమాంటిక్ రిలేషన్ లేదు, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ప్లాన్ కూడా నాకు లేదు. ఇలాంటి రూమర్స్ వల్ల నా నిర్మాతలు కాస్త కంగారు పడుతున్నారు. అందుకే నేను ఈ విషయం పై క్లారిటీ ఇస్తున్నానని’ సమంత తెలిపింది. ఈ స్టేట్మెంట్ మాత్రం అందరినీ షాక్ కి గురిచేసింది. ఈ విషయానికి సిద్దార్థ్ ఏమి రిప్లై ఇస్తాడో చూడాలి.

తాజా వార్తలు