చిరు, బాలయ్య కంటే రాములక్కకే ఎక్కువ రెమ్యునరేషన్.!

చిరు, బాలయ్య కంటే రాములక్కకే ఎక్కువ రెమ్యునరేషన్.!

Published on Jun 23, 2013 5:05 PM IST

Vijayashanthi
సుమారు 28 సంవత్సరాల పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తన గ్లామర్, నటన, స్టంట్స్ తో తిరుగులేని ముద్ర వేసుకుంది మన రాములక్క అదేనండి విజయశాంతి. విజయశాంతి తన కెరీర్లో కేవలం హీరోయిన్ పాత్రలు మాత్రమే చేసి ఊరుకోకుండా ‘కర్తవ్యం’, ‘ఒసేయ్ రాములమ్మ’ లాంటి పవర్ఫుల్ సినిమాలు చేసి డాషింగ్ లేడీగా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ అంతే డేరింగ్ గా దూసుకుపోతున్న విజయశాంతి పుట్టిన రోజు రేపు(జూన్ 24).

ఈ సందర్భంగా ఓ ప్రముఖ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 1990ల్లోనే కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న తీసుకున్న హీరోయిన్ మీరే కదా అని అడిగితే ‘ అది నిజమే. అప్పట్లో అందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ అంటే నేనే. చెప్పాలంటే అప్పట్లో చిరంజీవి, బాలకృష్ణ కంటే నాదే ఎక్కువ రెమ్యునరేషన్. అప్పట్లోనే ఓ పత్రిక రజినీ కాంత్, అమితాబ్ ల తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న తార విజయశాంతి అని ఓ ప్రముఖ పత్రిక రాసిందని’ ఆమె అన్నారు.

తాజా వార్తలు