బలుపు సినిమాలో మెరవనున్న అడవి శేష్

బలుపు సినిమాలో మెరవనున్న అడవి శేష్

Published on Jun 23, 2013 11:15 AM IST

Adivi-Ses
మాస్ మహారాజ రవితేజ మరోసారి ‘బలుపు’ సినిమాతో తన అదృష్టాన్ని పరిక్షించుకొనున్నాడు. ఈ సినిమాలో అడవి శేష్ ఒక ముఖ్య పాత్రను పోషించనున్నాడు. ఇప్పటికే ‘పంజా’, ‘కిస్’ సినిమాల ద్వారా అడవి శేష్ వార్తలలోకి నిలిచాడు. ఈ సినిమాలో అతను రోహిత్ అనే పాత్రలో కనిపిస్తాడు. అతడి పాత్రకు నెగిటివ్ షేడ్స్ ఉండొచ్చని అంచనా. ఈ సినిమా ఒక మాస్ మసాల ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.

శృతి హాసన్ ఈ సినిమాలో పూర్తిస్థాయి గ్లామర్ పాత్ర పోషించనుంది. అంజలి రెండో హీరోయిన్. థమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం పి.వి.పి సినిమా బ్యానర్ పై భారీ బడ్జెట్ లో రూపుదిద్దుకుంది. ఈ సినిమా ఈ నెల 28న విడుదలకానుంది.

తాజా వార్తలు