త్వరలో రానున్న ‘శంకర’ ఆడియో

త్వరలో రానున్న ‘శంకర’ ఆడియో

Published on Jun 23, 2013 9:45 AM IST

Shankara
నారా రోహిత్ హీరోగా రేజీనా హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘శంకర’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమా ఆడియోని త్వరలోనే రిలీజ్ చేయనున్నామని ఈ చిత్ర నిర్మాత ఆర్.వి.సి ప్రసాద్ తెలిపారు. అందరికీ తెలిసిన నిర్మాత కెఎస్ రామారావు సమర్పణలో శ్రీ లీలా మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి తాతినేని సత్య డైరెక్టర్. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మంచి ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయని ఆశిస్తున్నారు. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సురేందర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో ఆహుతి ప్రసాద్, ఎంఎస్ నారాయణ, రాజీవ్ కనకాల, ప్రగతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు