
తన మొదటి సినిమాతోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సత్తా చాటిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక కొత్త మార్క్ ని సినిమా మేకింగ్ లో తాను సెట్ చేయగా హిందీ మార్కెట్ లో కబీర్ సింగ్ సినిమాతో కొత్త లెక్కలు తాను పరిచయం చేశారు. ఇక నెక్స్ట్ అదే హిందీ మార్కెట్ లో ‘అనిమల్’ అనే మోస్ట్ వైలెంట్ యాక్షన్ అందులోని మంచి ఎమోషన్ తో అందించి చాలామందికి నిద్ర పట్టకుండా కూడా చేసాడనే టాక్ కూడా ఉంది.
అక్కడ నుంచి సందీప్ రెడ్డి వంగ కోసం హిందీ ఆడియెన్స్ సోషల్ మీడియాలో ఏదొక సందర్భంలో మాట్లాడుకుంటున్నారు. ఇక లేటెస్ట్ గా సందీప్ రెడ్డి వంగకి సరైన పోటీ ఇచ్చే దర్శకుడు తమకి దొరికాడు అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఓ రచ్చ నడుస్తుంది. మరి ఆ దర్శకుడే లేటెస్ట్ గా వచ్చిన హిట్ చిత్రం ‘ధురంధర్’ దర్శకుడు ఆదిత్య ధర్ అట.
3 గంటల 20 నిమిషాల రన్ టైం తో థియేటర్స్ లో సందీప్ రెడ్డి వంగ థియేటర్స్ లో ఆడియెన్స్ ని కూర్చోపెడితే ఇప్పుడు ఇంకో 10 నిమిషాలు ఎక్కువ పెట్టి ఆదిత్య ధర్ కూడా ధురంధర్ కి కూర్చోపెట్టాడు. ఇలా ఆల్రెడీ కొన్ని పోలికలు, యాక్షన్ అండ్ మాస్ టేకింగ్ పై ఇద్దరి సినిమాల విజువల్స్ తో రచ్చ మొదలైంది. మెయిన్ గా అనిమల్ సినిమాలోని షాట్స్ తో ధురంధర్ ని పోలుస్తున్నారు.
సో సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ లెవెల్లో సెట్టయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే కొన్ని అంశాలు ఆదిత్య ధర్ మ్యాచ్ చేసి ఉండొచ్చు కానీ ధురంధర్ టాక్ విని మన దగ్గర తెలుగు ఆడియెన్స్ కూడా చూడడం మొదలు పెట్టారు కానీ అనిమల్ సెట్ చేసిన రేంజ్ లో ఇది తమని హుక్ చెయ్యలేదు అనే కామెంట్స్ కూడా లేకపోలేవు.
పైగా నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన సినిమా కాబట్టి ధురంధర్ లో కొన్ని సీన్స్ మంచి ఎమోషనల్ గా వర్కౌట్ అయ్యాయి. కానీ సందీప్ రెడ్డి వంగకి సరైన పోటీనా కాదా అంటే వీరి ఫిల్మోగ్రఫీ నుంచి నెక్స్ట్ సినిమాలు కూడా చూస్తే ఒక క్లారిటీ అందరికీ వస్తుంది. ఆల్రెడీ ధురంధర్ 2 వచ్చే ఏడాది వచ్చేస్తుంది. ఇక సందీప్ నుంచి అనిమల్ 2, అలాగే స్పిరిట్ లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. సో ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే.

