Akhanda 2: ‘అఖండ 2’ ఎఫెక్ట్.. వరుస వాయిదాలు రజినీ సినిమా కూడా

Akhanda 2: ‘అఖండ 2’ ఎఫెక్ట్.. వరుస వాయిదాలు రజినీ సినిమా కూడా

Published on Dec 10, 2025 11:01 AM IST

Akhanda-2

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం (Akhanda 2). దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా వాయిదా పడిన తర్వాత మరింత హైప్ ని సొంతం చేసుకుందని చెప్పాలి. ఇలా ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా ఈ డిసెంబర్ 11 రాత్రి ప్రీమియర్స్ 12 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ కాబోతుండగా ఈ డేట్ కి రావడంతో అప్పటికే షెడ్యూల్ అయ్యి ఉన్న పలు సినిమాలు బాలయ్య ఎఫెక్ట్ తో వాయిదా పడాల్సి వచ్చింది అని చెప్పాలి.

వాయిదా పడ్డ తెలుగు సినిమాలు..

అఖండ 2 (Akhanda 2) డేట్ మారిన తర్వాత ఒకింత మిగతా సినిమాలకి సస్పెన్స్ గా మారింది. మేకర్స్ ఇంతకీ రిలీజ్ డేట్ ని రివీల్ చేయకపోవడంతో ఇటు డిసెంబర్ 12 కి అలాగే 25కి ప్లాన్ చేసుకున్న సినిమాలు మార్చుకోవాలా అనే టెన్షన్ ఏర్పడింది. అయితే ఫైనల్ గా డిసెంబర్ 12 అనౌన్స్ చేయడంతో ఆరోజుకి లాక్ చేసుకున్న నోటెడ్ తెలుగు సినిమాలు మోగ్లీ (Mowgli) ఇంకా సైక్ సిద్ధార్థ్ లు వాయిదా పడ్డాయి. రోషన్ కనకాల, సందీప్ రాజ్ ల మోగ్లీ డిసెంబర్ 13న విడుదల అయితే నందు సైక్ సిద్ధార్థ్ మాత్రం జనవరి 1కి మారింది.

ఈ లిస్ట్ లో రజినీకాంత్ సినిమా కూడా..

బాలయ్య సినిమా మూలాన సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) సినిమా కూడా తెలుగు స్టేట్స్ లో వాయిదా పడాల్సి వచ్చింది. అయితే ఇది కొత్త సినిమా కాదు రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా ప్లాన్ చేసిన రీరిలీజ్ చిత్రం ‘శివాజీ’. శంకర్ తెరకెక్కించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ ని కూడా అఖండ 2 మూలాన వాయిదా వేసినట్టు కన్ఫర్మ్ చేశారు.

సో ఇలా మార్కెట్ లో అఖండ 2 హవా ఉందని చెప్పాలి. మరి ఈ సినిమా అనుకున్న అంచనాలు రీచ్ అవుతుందా లేదా అనేది ఈ కొంతసేపు వేచి చూస్తే సరిపోతుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు