‘వారణాసి’ ఆ గ్లోబల్ ప్రచారంపై క్లారిటీ!

‘వారణాసి’ ఆ గ్లోబల్ ప్రచారంపై క్లారిటీ!

Published on Dec 10, 2025 9:01 AM IST

varanasi

ప్రస్తుతం తెలుగు సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ లెవెల్ చిత్రమే “వారణాసి”. సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో చేస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర రికార్డు బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా దర్శకుడు ఈ సినిమాని గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత చేరువ అయ్యేలా జక్కన్న ప్రతీ ప్రయత్నం చేస్తున్నారు.

ఇలా లేటెస్ట్ గా వారణాసి గ్లింప్స్ ని లాస్ వేగాస్ కి చెందిన ఫేమస్ స్పియర్ బాల్ పై ప్రదర్శితం చేయడం జరిగింది అంటూ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారుతుండగా అభిమానులు సహా చాలా మంది అది నిజమే అనుకున్నారు. కానీ అసలు ఇది నిజం కాదు అని తెలుస్తుంది.

ఇవన్నీ కేవలం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసిన ఫోటోలు అట. వారు అక్కడ ప్రచారం చేయలేదని చెప్పాలి. కానీ అక్కడ ప్రమోట్ చేసేందుకు ఛాన్స్ లేదా అంటే ఉందని కూడా చెప్పొచ్చు. ఆ ఎల్ ఈ డి పై ప్రమోషన్స్ కి కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది సో అందుకు పాజిబులిటీ ఉంది కానీ అది ఫ్యూచర్ లో ఏమన్నా సెట్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు