మెలోడీస్ పై దృష్టి పెట్టిన డ్రమ్స్ స్పెషలిస్ట్

మెలోడీస్ పై దృష్టి పెట్టిన డ్రమ్స్ స్పెషలిస్ట్

Published on Jun 20, 2013 9:50 PM IST

SS-Thaman

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనతి కాలంలోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసే చాన్స్ కొట్టేయడమే కాకుండా తన ఫాస్ట్ బీట్స్ తో యువతని ఆకట్టుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ త్వరలోనే 50 సినిమాల మైలురాయిని చేరుకోనున్నాడు. ఈ రోజు ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఓ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ పాటల్లో ఎక్కువ బీట్స్, డ్రమ్స్ సౌండ్స్ ఎక్కువగా వినిపిస్తాయి. ఎదుకంటారు అని అడిగితే ‘ నా కెరీర్ కమర్షియల్ అంశాలున్న సినిమాలతో మొదలైంది. సినిమాకి తగ్గట్టు మ్యూజిక్ కంపోజ్ చేసాను. స్టార్ హీరోలందరితో చేసాను, యువత మెచ్చుకునే పాస్ట్ బీట్ లతో పాటు మెలోడీస్ కూడా ఇచ్చాను. కానీ అవి తక్కువే చేసాను అందుకే ఇక నుంచి మెలోడీస్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాను. ఈ మధ్య కొత్త కథలు వస్తుండడంతో దర్శకులు కూడా మెలోడీస్ ఉండాలని పట్టుబట్టు తున్నారని’ థమన్ అన్నాడు. అలాగే ”బాలీవుడ్ కి తప్పకుండా వెళ్తాను కానీ ఇక్కడ పనిచేసిన దర్శకులతో కలిసి బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తే బాగుంటుందని’ అనుకుంటున్నాను.

తాజా వార్తలు