కన్ఫర్: కార్తీ లైనప్ లో టాలెంటెడ్ టాలీవుడ్ దర్శకుడు!

కన్ఫర్: కార్తీ లైనప్ లో టాలెంటెడ్ టాలీవుడ్ దర్శకుడు!

Published on Dec 10, 2025 8:15 AM IST

karthi 1

ప్రస్తుతం కోలీవుడ్ టాలెంటెడ్ హీరో కార్తీ నటించిన అవైటెడ్ సినిమా “అన్నగారు వస్తారు” తమిళ్ ఇంకా తెలుగులో రిలీజ్ కి రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే చాలామంది ఖైదీ 2 కూడా తన లైనప్ నుంచి ఎదురు చూస్తున్నారు.

కానీ లేటెస్ట్ గా తన లైనప్ పై ఓ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ని తాను అందించడం వైరల్ గా మారింది. మన టాలీవుడ్ లో బ్రోచేవారెవరురా, అంటే సుందరానికీ లేటెస్ట్ గా సరిపోదా శనివారం తో మాస్ హిట్ అందుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ తో సినిమా తను కన్ఫర్మ్ చేసాడు.

రీసెంట్ గానే వివేక్ ఓ స్క్రిప్ట్ నరేట్ చేసాడు అని అతను మంచి టాలెంటడ్ అని తెలిపాడు. అలాగే నెక్స్ట్ నరేషన్ కోసం వైట్ చేస్తున్నట్టు కార్తీ తెలిపారు. సో వీరి కాంబినేషన్ కన్ఫర్మ్ అయినట్టే అని చెప్పాలి. ఒకవేళ సెట్టయితే వీరి నుంచి ఎలాంటి సినిమా వస్తుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు