Ustaad Bhagat Singh : ఉస్తాద్ స్టెప్పులేస్తే భూకంపం ఖాయం.. పవర్ ప్యాక్ రెడీ చేస్తున్న పవన్..!

Ustaad Bhagat Singh : ఉస్తాద్ స్టెప్పులేస్తే భూకంపం ఖాయం.. పవర్ ప్యాక్ రెడీ చేస్తున్న పవన్..!

Published on Dec 9, 2025 7:00 PM IST

UBS

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Ustaad Bhagat Singh) నుండి సాలిడ్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి ‘దేఖ్‌లేంగే సాలా’ అనే సాంగ్ ప్రోమోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. దర్శకుడు హరీష్ శంకర్ ముందు నుంచి చెబుతున్నట్లు ఈ పాటలో పవన్ తన పవర్ మరోసారి చూపెట్టాడు.

దేవిశ్రీ ప్రసాద్ క్యాచీ ట్యూన్స్‌కి పవన్(Pawan) వేస్తున్న స్టెప్పులు అదిరిపోయాయి. నిజంగానే పవన్ స్టె్ప్ వేస్తే భూకంపం వస్తుందన్నట్లుగా ఇందులో కొరియోగ్రఫీ డిజైన్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక పవన్ ట్రెండీ లుక్స్‌తో ఫుల్ జోష్‌లో డ్యాన్స్ మూమెంట్స్ చేస్తున్నాడు. పవన్‌ను ఇంత ట్రెండీగా చూసి చాలా రోజులు అయిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విశాల్ దడ్లాని తనదైన రీతిలో ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం ఖాయమని ఈ ప్రోమో చూస్తే అర్థమవుతోంది.

ఇక ఈ పాటను డిసెంబర్ 13న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొత్తానికి పవన్ అభిమానులకు ఈ పాటతో పవన్ మాంచి ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో పవన్ స్టెప్స్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు