పవర్ స్టార్ మాస్ ప్లానింగ్.. ఆ నిర్మాతతో వరుస సినిమాలు కానీ!

పవర్ స్టార్ మాస్ ప్లానింగ్.. ఆ నిర్మాతతో వరుస సినిమాలు కానీ!

Published on Dec 8, 2025 7:01 PM IST

Pawan-Kalyan

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాత్రమే కాకుండా తన రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక తన నుంచి నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ రాబోతుంది. ఇదంతా బాగానే ఉంది కానీ పవన్ లైనప్ పై క్రేజీ రూమర్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. దీని ప్రకారం ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తో కలిసి పవన్ వరుస సినిమాలు చేయనున్నట్టు టాక్.

అయితే ఇది హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా అన్నట్టు టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇది పక్కన పెడితే ఆల్రెడీ బ్రో అనే సినిమా వీరి కాంబినేషన్లో రాగా దాని తర్వాత పవన్ తో ఓ భారీ సినిమా కూడా చేస్తానని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత చెప్పారు. కానీ లేటెస్ట్ గా వీరి కాంబినేషన్ నిర్మాణం వైపు అన్నట్టు మొదలైంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది ఒక క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు