నిర్మాత ప్రేరణ అరోరా తన పుట్టినరోజు (డిసెంబర్ 8 ) సందర్భంగా జీ స్టూడియోస్‌తో కలిసి తమ తదుపరి పాన్-ఇండియా అడ్వెంచర్ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆమె జీవితంలో అదృష్ట సంఖ్యగా భావించే ‘8’ ఈ శుభ సందర్భానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది.
‘రుస్తమ్’, ‘జటాధరా’ వంటి చిత్రాల తర్వాత, జీ స్టూడియోస్‌తో ప్రేరణ అరోరా గారికి ఇది మూడవ సహకారం కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్ మరియు ప్రేరణ అరోరా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కీర్తన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇటీవల థియేటర్లలో ప్రదర్శించబడిన ‘జటాధరా’ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై టాప్ చార్ట్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ‘రుస్తమ్’, ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మాన్’, ‘పరీ’ వంటి జాతీయ అవార్డులు గెలుచుకున్న మరియు వాణిజ్యపరంగా విజయం సాధించిన చిత్రాలతో బాలీవుడ్‌లో యువ మహిళా నిర్మాతగా ప్రేరణ అరోరా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆమె ప్రాజెక్టులు హిందీతో పాటు దక్షిణ భారత చిత్ర పరిశ్రమలోనూ మంచి ఆదరణ పొందుతున్నాయి.


