విడుదల తేదీ : డిసెంబర్ 07, 2025
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : రావణ్ రెడ్డి నిట్టూరు, గడ్డం శ్రీనివాస్, చాందిని రావు
దర్శకత్వం : కొత్తపల్లి సురేష్
నిర్మాత : కొత్తపల్లి సురేష్
సంగీతం : ప్రజ్వల్ క్రిష్
సినిమాటోగ్రఫీ : నిరంజన్ దాస్
ఎడిటింగ్ : బాల్రాజ్ విబిజే
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో లేటెస్ట్ గా స్ట్రీమింగ్ కి వచ్చిన కొత్త లఘు చిత్రమే ‘ఘటన'(Ghatana). ప్రతీ వారం ప్రసారం అవుతున్న కథా సుధ వీక్లీ సిరీస్ నుంచి వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో ఉందో చూద్దాం.
కథ:
తమ సినిమాకి మంచి రచయిత కోసం చూస్తున్న నిర్మాత/దర్శకుడు (గడ్డం శ్రీనివాస్) ఓ ఇద్దరు రచయితలను షార్ట్ లిస్ట్ చేసి మూడు పాత్రలు గీత (చాందిని రావు), రాము (రావణ్ రెడ్డి నిట్టూరు) అలాగే గీత తండ్రి (గడ్డం శ్రీనివాస్) లపై రెండు డిఫరెంట్ యాంగిల్స్ చెప్తారు. ఇందులో రెండు ఎండింగ్స్ ఒకొకటి ఒకో రకంగా డిజైన్ చేయబడతాయి. మరి ఆ ఎండింగ్స్ ఏంటి? ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ గా ఆ సీన్స్ కి మంచి ఎండింగ్ ఇచ్చారు? ఇంతకీ వారికి ఇచ్చిన సీన్స్ ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ లఘు చిత్రంలో మెయిన్ పాయింట్.
ప్లస్ పాయింట్స్:
ఒక నాణేనికి రెండు వైపుల ఉన్నట్టు ఒక పరిస్థితి రెండు రకాలుగా జరిగి ఉంటే అనే కాన్సెప్ట్ లో ఈ షార్ట్ ఫిలిం కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా దర్శకుడు కేవలం మూడే పాత్రలు నడుమ డిజైన్ చేసుకున్న రెండు పరిస్థితులు వాటిని డిజైన్ చేసుకున్న విధానం మెప్పిస్తుంది.
రెండు వెర్షన్స్ కూడా డీసెంట్ గానే అనిపిస్తాయి. అలానే రాసుకున్న ట్విస్ట్ లు సస్పెన్స్ ఫ్యాక్టర్ లు ఇందులో బాగున్నాయి. ఇక వీరిలో సీనియర్ నటుడు గడ్డం శ్రీనివాస్ మంచి వేరియేషన్స్ చూపించి నటన పరంగా ఆశ్చర్యపరుస్తారు. తనతో పాటుగా చాందిని, రావణ్ రెడ్డి కూడా మంచి పెర్ఫామెన్స్ లు అందించారు.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాలో కోర్ పాయింట్ బాగానే ఉంది, కథనం కూడా డీసెంట్ గానే నడిపించినప్పటికీ ఓవరాల్ గా మరీ అంత థ్రిల్లింగ్ గా అనిపించదు. అలాగే సీన్స్ కూడా కొంచెం ఊహాజనితంగానే వెళ్తాయి కాబట్టి మరీ కొత్తదనం లాంటివి కోరుకునేకారికి ఈ చిత్రం అలరిస్తుంది అని చెప్పలేం.
సాంకేతిక వర్గం:
ఈ షార్ట్ ఫిలిం లో నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు, నిర్మాతగా కొత్తపల్లి సురేష్ డీసెంట్ వర్క్ ఈ సినిమాకి అందించారు అని చెప్పవచ్చు. అలాగే ప్రజ్వల్ క్రిష్ ఇచ్చిన స్కోర్ బాగుంది. బాలాజీ ఎడిటింగ్ బాగుంది. నిరంజన్ దాస్ ఇచ్చిన కెమెరా వర్క్ కూడా బావుంది. దర్శకుడు కొత్తపల్లి సురేష్ విషయానికి వస్తే.. ఈ సినిమాకి తన కథ, కథనాలు ప్లాన్ చేసుకున్న విధానం బాగుంది. డీసెంట్ థ్రిల్ మూమెంట్స్ తో సినిమాని నడిపించి ఇంప్రెస్ చేశారు. అయితే ఇది మరీ కొత్తదేమీ కాదు కానీ తీసుకున్న కథాంశాన్ని బోర్ లేకుండా నడిపించారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ‘ఘటన’ అనే లఘు చిత్రం సస్పెన్స్, క్రైమ్ లాంటి కంటెంట్ ని ఇష్టపడేవారికి కొంతమేర మెప్పిస్తుంది. మరీ కొత్తదనం లేదు కానీ ఉన్న కథాంశంలోనే దర్శకుడు కథనాన్ని డీసెంట్ గా తీసుకెళ్లారు. అలానే నటీనటులు కూడా మంచి పెర్ఫామెన్స్ లని అందించారు. సో ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ లో మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ట్రై చేయొచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team


