వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్’ సెన్సేషన్!

వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ‘ధురంధర్’ సెన్సేషన్!

Published on Dec 8, 2025 1:58 PM IST

Dhurandhar 2

లేటెస్ట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర హిట్ టాక్ తెచ్చుకున్న అవైటెడ్ చిత్రమే “ధురంధర్”. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించగా వెర్సటైల్ నటుడు అక్షయే ఖన్నా పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించాడు. అయితే ఈ సినిమా అంచనాలు అందుకొని సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకోగా ఈ సినిమా మొత్తం 3 రోజుల రన్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది.

ఇలా వరల్డ్ వైడ్ గా 160 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు ఈ సినిమా సొంతం చేసుకుని అదరగొట్టింది. ఈ సినిమా మూడో రోజు రికార్డు మొత్తం 44 కోట్లకి పైగా వసూళ్లు ఒక్క ఇండియా నుంచే రాబట్టింది. ఇక ఈ సినిమా మూడు రోజుల్లో 106 కోట్లకి పైగా రాబడితే మిగతా మొత్తం ఓవర్సీస్ మార్కెట్ నుంచి రాబట్టడం విశేషం. దీనితో ధురంధర్ సాలిడ్ లాంగ్ రన్ ని ప్రామిస్ చేస్తుంది అని చెప్పవచ్చు.

తాజా వార్తలు