వెంకటేష్’ పాత్ర పై అనిల్ రావిపూడి క్లారిటీ !

వెంకటేష్’ పాత్ర పై అనిల్ రావిపూడి క్లారిటీ !

Published on Dec 8, 2025 11:02 AM IST

chiru venky

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో ఎక్స్‌టెండెడ్ క్యామియో పాత్రలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం వెంకీ ఈ సినిమాలోని ఓ పాట షూట్ ను కూడా పూర్తి చేశాడు. ఐతే, దర్శకుడు అనిల్ రావిపూడి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. వెంకటేష్ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. పైగా సినిమాలో వెంకీ దాదాపు 20 నిమిషాలు కనిపిస్తారని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు.

ముఖ్యంగా చిరంజీవి, వెంకటేష్ కలిసి నటించిన క్లైమాక్స్ సీన్స్ అభిమానులను బాగా అలరిస్తాయని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. మొత్తానికి ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ సినిమా కచ్చితంగా అభిమానులకు నచ్చుతుంది’ అని మెగాస్టార్ తెలిపారు. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తారని చిరు తెలిపారు.

తాజా వార్తలు