ఆ దర్శకుడికి ఈ సారి హిట్ గ్యారెంటీ అట !

ఆ దర్శకుడికి ఈ సారి హిట్ గ్యారెంటీ అట !

Published on Dec 8, 2025 7:04 AM IST

Sharwanand

దర్శకుడు శ్రీను వైట్ల – హీరో శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా పై నిర్మాత అనిల్ సుంకర క్రేజీ కామెంట్స్ చేశారు. ఇంతకీ, అనిల్ సుంకర ఏం మాట్లాడారు అంటే.. ‘శ్రీనువైట్ల కమ్ బ్యాక్ అవుతున్నాడు. ప్రస్తతం తను ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కథ చాలా బాగుంది. కథ నేను విన్నాను. ఆ కథతో శ్రీను ఈజ్ బ్యాక్. ఎందుకంటే ఆ సినిమా రిజల్ట్ నాకు ముందే తెలిసిపోయింది. వంద శాతం హిట్ గ్యారెంటీ’ అంటూ శ్రీనువైట్ల కథ గురించి అనిల్ సుంకర చెప్పుకొచ్చాడు.

ఐతే, గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ గా నిలిచింది. దీంతో, ఎలాగైనా మళ్ళీ టాలీవుడ్ లో తన తర్వాత సినిమాతో బిజీ అయ్యేందుకు శ్రీనువైట్ల తెగ కష్ట పడుతున్నాడు. ఈ క్రమంలోనే శర్వాకి కథ చెప్పాడు. వచ్చే ఏడాది జనవరిలో వీరిద్దరి కలయికలో ఈ సినిమా మొదలు అవుతుందట. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా కనిపిస్తాడని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు