బిగ్గెస్ట్ మాస్ హీరో.. బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రయోగాలు వర్కౌట్ అవుతాయా?

బిగ్గెస్ట్ మాస్ హీరో.. బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రయోగాలు వర్కౌట్ అవుతాయా?

Published on Dec 7, 2025 11:00 PM IST

Ntr prahas

మన తెలుగు సినిమా నుంచి పాన్ ఇండియా లెవెల్లో మంచి ఫేమ్ తెచ్చుకున్న స్టార్ హీరోస్ లో ఇండియన్ సినిమా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరో జూనియర్ ఎన్టీఆర్ లు కూడా ఒకరు. ఇద్దరూ ఇప్పుడు భారీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. కానీ ప్రస్తుతం ఒక కామన్ పాయింట్ ఇద్దరు స్టార్స్ నడుమ కామన్ గా కనిపిస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కోసం ఊహించని మేకోవర్ సిద్ధం చేసాడు. అయితే ఇది ఆఫ్ లైన్ లో కొన్ని కొన్ని ఫోటోలు చూసి అభిమానులు కంగారు పడ్డారు. అలాగే ఇప్పుడు ప్రభాస్ కూడా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం అదే లీన్ లుక్ లోకి మారడం జరిగింది.

ఇలా తమ సినిమాల కోసం ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ అండ్ సూపర్ స్టార్ హీరోలు ఇంతలా ఛేంజ్ అవ్వడం ఒకింత ఫ్యాన్స్ లో కొంచెం కంగారు పెట్టినా ఆన్ స్క్రీన్ పై మాత్రం మెంటల్ మాస్ ఎక్స్ పీరియెన్స్ ఇచ్చే విధంగా వర్కౌట్ అవుతాయని వినిపిస్తుంది. సో అభిమానులు మాత్రం సినిమాల్లో ఈ కటౌట్స్ చేసే మ్యాజిక్ విషయంలో ఎలాంటి టెన్షన్ పెట్టుకోనక్కర్లేదట. మరి ఇద్దరు స్టార్ దర్శకులు వీరిని ఎలా ప్రెజెంట్ చేస్తారో చూడాలి మరి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు