ఎనర్జిటిక్ పోస్టర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ సింగిల్ ప్రోమోకి టైం ఫిక్స్!

ఎనర్జిటిక్ పోస్టర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫస్ట్ సింగిల్ ప్రోమోకి టైం ఫిక్స్!

Published on Dec 7, 2025 5:55 PM IST

usta

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల అలాగే రాశి ఖన్నా హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “ఉస్తాద్ భగత్ సింగ్” కూడా ఒకటి. ఓజి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్ నుంచి ఈ సినిమా వస్తుండగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని ఈ నెల లోనే రిలీజ్ చేస్తున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక దీనిపై లేటెస్ట్ గా ఒక ఎనర్జిటిక్ పోస్టర్ ని పవన్ పై వదిలి ఈ సాంగ్ తాలూకా ప్రోమోని డిసెంబర్ 9న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. దీనితో ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాలిడ్ డాన్స్ నెంబర్ ని పవన్ నుంచి వారు ఆశిస్తున్నారు.

పైగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ సాంగ్ ని మంచి హైప్ కూడా చేశారు. సో ఈ ఫుల్ సాంగ్ దానికి ముందు ప్రోమో ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాదిలో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు