The Boys: బోల్డ్ సిరీస్ ఫైనల్ ఫీస్ట్ కి డేట్ ఫిక్స్.. ఆ సిరీస్ ని మ్యాచ్ చేస్తుందా?

The Boys: బోల్డ్ సిరీస్ ఫైనల్ ఫీస్ట్ కి డేట్ ఫిక్స్.. ఆ సిరీస్ ని మ్యాచ్ చేస్తుందా?

Published on Dec 7, 2025 5:01 PM IST

TheBoysSeason5

వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న పలు పాపులర్ వెబ్ సిరీస్ లలో కొన్ని ఇప్పుడు ఫైనల్ ట్రీట్ కి వచ్చాయి. అలా లేటెస్ట్ గా దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ నుంచి స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 (Stranger Things 5) వచ్చింది. దీని నుంచి ఇంకా కొన్ని ఎపిసోడ్స్ బాకీ ఉన్నాయి. అయితే ఈ సిరీస్ లానే వరల్డ్ వైడ్ ఆడియెన్స్ లో అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి కూడా మంచి క్రేజ్ ఉన్న సిరీస్ ఒకటి ఉంది.

అదే “ది బాయ్స్”. ఇదొక బ్యాడాస్ అండ్ బ్లడ్ బాత్ తో కూడిన అడల్ట్ సిరీస్ అని చెప్పాలి. దీనికి కూడా మంచి క్రేజ్ ఉండగా ఇప్పుడు మేకర్స్ ఓ సాలిడ్ టీజర్ తో ఫైనల్ సీజన్ (The Boys Season 5) తాలూకా డేట్ ని అందించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 8 నుంచి కొత్త సీజన్ స్టార్ట్ కానున్నట్టుగా ప్రకటించారు. అయితే ఇందులో దీనికి సబ్ సిరీస్ ‘జెన్ – వి’ (Gen – V) లో పాత్రలు కూడా కనిపిస్తున్నాయి. సో ఫైనల్ బ్యాటిల్ ఇంకా గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది.

కానీ ఇది స్ట్రేంజర్ థింగ్స్ రేంజ్ లో హైప్ ని సెట్ చేసుకుంటుందా లేదా అనేది చూడాలి. లాస్ట్ టైం ది బాయ్స్ సీజన్ 4 కి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ రిలీజ్ కి ముందు సాలిడ్ బజ్ వచ్చింది. ఇక ఫైనల్ సీజన్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో మున్ముందు చూడాలి మరి. ఈ గత సీజన్ లు అన్నీ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉన్నాయి. ట్రై చేయాలి అంటే చేయొచ్చు. కానీ అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు