ఫోటో మూమెంట్ : తన తల్లితో సమంత మధుర క్షణం !

ఫోటో మూమెంట్ : తన తల్లితో సమంత మధుర క్షణం !

Published on Dec 7, 2025 8:00 AM IST

samatha 2

హీరోయిన్ సమంత వివాహబంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో సమంత-రాజ్‌ నిడిమోరు పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తన వివాహ ఆనందంలో మునిగిపోయిన సమంత, తన పెళ్లి వేడుకలోని క్షణాలను అభిమానులతో పంచుకుంది. తాజాగా ఆమె తన పోస్ట్ లో తన తల్లి నినెట్ ప్రభుతో దిగిన ఒక ఫోటోని పంచుకుంది. సమంత ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది.

రీసెంట్ గా సమంత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి పోస్ట్‌ పెట్టింది. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ సమక్షంలో.. గత ఏడాదిన్నరగా నా కెరీర్‌లో సాహసోపేతమైన అడుగులు వేశాను. రిస్క్‌ తీసుకున్నాను. ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నాను. ఇది కేవలం ఆరంభమే’’ అని చెప్పుకొచ్చింది. పైగా ఆ పోస్ట్‌తో పాటు ఆమె రాజ్‌ నిడిమోరుతో ఉన్న ఫొటోను కూడా పంచుకుంది. మొత్తానికి ఇప్పుడు వీరిద్దరూ పెళ్లితో ఒక్కటి అయ్యారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు