Akhanda 2 Crazy News: ‘అఖండ 2’ రిలీజ్ కి ఈ రెండు డేట్స్ ఫైనల్?

Akhanda 2 Crazy News: ‘అఖండ 2’ రిలీజ్ కి ఈ రెండు డేట్స్ ఫైనల్?

Published on Dec 7, 2025 12:00 AM IST

Akhanda-2

ప్రస్తుతం టాలీవుడ్ ఆడియెన్స్ లో ఎవరిని కదిపినా కూడా అఖండ 2 (Akhanda 2) రిలీజ్ కోసమే చర్చించుకుంటున్నారు. నటసింహం బాలకృష్ణ అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో చేసిన ఈ అవైటెడ్ సీక్వెల్ సినిమా కోసం అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తుండగా ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఊహించని విధంగా రిలీజ్ వాయిదా వేసి మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. ఇక రిలీజ్ ఎప్పుడు అనే సస్పెన్స్ కి ఇప్పుడు సమాధానం వినిపిస్తుంది.

ఈ రెండు డేట్స్ పై ‘అఖండ 2’ కన్ను!?

అనుకున్న సమయానికి రాలేకపోయినప్పటికీ అఖండ 2 (Akhanda 2 Thandavam) రిలీజ్ ని మేకర్స్ ప్రస్తుతం రెండు డేట్స్ లో అనుకుంటున్నారట. అయితే డిసెంబర్ 12 లేదా 25 ఈ రెండిట్లో డెఫినెట్ గా ఏదొక డేట్ కి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని వినిపిస్తుంది. సో వీటిపై ఓ క్లారిటీ త్వరలోనే రానుంది.

(Akhanda 2 Premiers) మరి ప్రీమియర్స్ మాటేమిటి?

ఈ విషయానికి వస్తే డిసెంబర్ 12 లేదా 25 రెండిట్లో ఏ డేట్ లో వచ్చినా కూడా మేకర్స్ డెఫినెట్ గా ముందు రోజు ప్రీమియర్స్ ని వేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అంటే డిసెంబర్ 11, లేదా 24న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ ప్రీమియర్స్ ఉండనున్నాయి.

ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ వారు నిర్మాణం వహించారు. అలాగే సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు