‘పెద్ది’: 3 వారాల్లోనే 70 మిలియన్.. ఇప్పట్లో ఆగేలా లేదే

‘పెద్ది’: 3 వారాల్లోనే 70 మిలియన్.. ఇప్పట్లో ఆగేలా లేదే

Published on Nov 29, 2025 12:00 AM IST

peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. ఒక రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా సాలిడ్ ఎమోషన్స్ తో రాబోతున్న ఈ సినిమా నుంచి ఆల్రడీ వచ్చిన మొదటి సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ నుంచి చాలా కాలం తర్వాత ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ కూడా ఇదే అని చెప్పొచ్చు.

ఇలా ఈ సాంగ్ కేవలం తెలుగు వెర్షన్ లోనే 70 మిలియన్ కి పైగా వ్యూస్ ని కేవలం ఈ 3 వారాల్లోనే క్రాస్ చేసి దూసుకెళ్తుంది. ఇప్పటికీ మ్యూజిక్ ఛార్ట్స్ లో నెంబర్ 3లో ట్రెండింగ్ లో ఈ సాంగ్ కొనసాగుతూ ఉండడం విశేషం. మరి ఈ హవా అంతా ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించడం లేదు. మరి నెక్స్ట్ సాంగ్ వచ్చేసరికి మూమెంట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. ఇక ఈ సినిమాకి వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది మార్చ్ 27న పాన్ ఇండియా లెవెల్లో మేకర్స్ ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు