‘అఖండ 2 తాండవం’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. మాస్ చిత్రాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్లో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను మెప్పించింది. ఇక తాజాగా ఈ చిత్రం నుండి మరో టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్ పూర్తి యాక్షన్ ట్రీట్‌తో అదిరిపోయింది. బాలయ్య తనదైన డైలాగులతో పాటు యాక్షన్‌తో దుమ్ములేపాడు. ఇక బోయపాటి శ్రీను తనదైన టేకింగ్‌తో ఈ టీజర్‌ను కట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. కాగా, ఈ టీజర్లో ఓ సీన్లో బాలయ్య గదతో విలన్లను బాదుతాడు. ఆ సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో పవనపుత్రుడు హనుమాన్ మనకు కనిపిస్తారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా ఇంప్రెస్ అయ్యారు. గతంలో అఖండ చిత్రంలో శివుడిని చూపెట్టిన సీన్‌కు థియేటర్లు బ్లాస్ట్ అయ్యాయి. మరి ఈసారి పవన పుత్రుడు హనుమంతుడు కనిపించగానే థియేటర్లలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
ఆదిపినిశెట్టి విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రొడ్యూస్ చేస్తున్నారు.



