మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా సినిమా సంక్రాంతి 2026లో విడుదల కానుంది. అయితే ఈ సినిమా కోసం మెగాస్టార్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారా.. అనేది ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి రూ.72 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న ఆయన కుమార్తె సుస్మిత కొణిదెలకు లాభాల్లో 50 శాతం వాటా ఉండనుంది. దీంతో ఈ సినిమా బడ్జెట్ విషయంలో మేకర్స్ నుండి క్లారిటీ వస్తుందని సినీ సర్కిల్స్ వెయిట్ చేస్తున్నాయి.
కాగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనుండగా, నయనతార హీరోయిన్గా నటిస్తోంది. భీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.


