అఫీషియల్ : రిలీజ్ డేట్ వాయిదా వేసిన శర్వానంద్ ‘బైకర్’

అఫీషియల్ : రిలీజ్ డేట్ వాయిదా వేసిన శర్వానంద్ ‘బైకర్’

Published on Nov 26, 2025 7:00 PM IST

Biker 3

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘బైకర్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. తొలిసారి ఓ బైక్ రేస్ చిత్రం వస్తుండటంతో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అభిలాష్ రెడ్డి కంకర డైరెక్ట్ చేసిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది.

అయితే, ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను వాయిదా వేస్తు్న్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన వర్క్స్‌ను పర్ఫెక్ట్‌గా తీర్చిదిద్దే పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉందని.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమాను అందించేందుకు తాము పనిచేస్తున్నామని.. అందుకే ఈ సినిమాకు మరింత సమయం తీసుకుంటున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇక ఈ సినిమాను 3D, 4DX లతో పాటు ఇతర ఫార్మాట్‌లలోనూ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అందుకే ఈ సినిమాను డిసెంబర్ 6న రిలీజ్ చేయడం లేదని చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Biker

సంబంధిత సమాచారం

తాజా వార్తలు