మన టాలీవుడ్ దగ్గర ఆన్ స్క్రీన్ పై మంచి జంటగా పేరు తెచ్చుకున్న జంటగా నేను శైలజ హీరో హీరోయిన్స్ రామ్ పోతినేని, కీర్తి సురేష్ ల జంట కూడా ఒకటి. తమ ఇద్దరి కెరీర్ లో కలిసి చేసిన మొదటి సినిమా “నేను శైలజ”. తెలుగులో తమ ఇద్దరికీ మంచి బ్రేక్ ఇచ్చింది. కీర్తి సురేష్ కి సాలిడ్ తెలుగు డెబ్యూ అలాగే రామ్ కి కూడా కెరీర్ పరంగా మంచి హిట్ ని ఇచ్చి తనని గాడిలో పడేసింది.
ఇక ఈ ఇద్దరు జంట తమ కొత్త సినిమాలుతో ఈ వారం థియేటర్స్ లో సందడి చేసేందుకు ఒక్క రోజు గ్యాప్ లో వస్తున్నారు. రామ్ నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా రేపు నవంబర్ 27న థియేటర్స్ లో వస్తుంటే కీర్తి సురేష్ నటించిన రివాల్వర్ రీటా చిత్రం నవంబర్ 28న థియేటర్స్ లో రాబోతుంది. అయితే ఇప్పుడు ఇద్దరూ ఒక మంచి కంబ్యాక్ కోసం చూస్తున్నారు.
రామ్ నటించిన లాస్ట్ చిత్రం డబుల్ ఇస్మార్ట్ బెడిసి కొట్టింది. అలాగే కీర్తి సురేష్ కి కూడా చాలా రోజులు నుంచి మంచి హిట్ లేదు. సో వీరి ఆశలన్నీ ఈ సినిమాల పైనే ఉన్నాయి. మరి ఈ నేను శైలజ జంట తాము కోరుకుంటున్న హిట్టు ఈ ఒక్క రోజు గ్యాప్ లో వచ్చి కొడతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.


