
మన టాలీవుడ్ దగ్గర ఉన్నటువంటి మంచి క్రియేటివ్ దర్శకుల్లో రవిబాబు కూడా ఒకరు. తనదైన శైలి టేకింగ్ తో కామెడీ ఇంకా హారర్ సినిమాలకి స్పెషల్ మార్క్ ని వేసుకున్న తన నుంచి రీసెంట్ గా వచ్చిన చిత్రమే “ఏనుగు తొండం ఘటికాచలం”. నేరుగా ఓటిటిలోనే రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా ఓటిటిలో సంచలన రెస్పాన్స్ ఇప్పుడు అనుకున్నట్టు తెలుస్తుంది.
మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ లో ప్రసారంకి వచ్చిన ఈ సినిమా ఈ రెండు వారాల్లో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని అందులో క్రాస్ చేసిందట. దీనితో ఈ సినిమాకి ఓటిటిలో గట్టి రెస్పాన్స్ నే వచ్చింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అయ్యి ఉంటే ఈ రెస్పాన్స్ ఇంకా ఎక్కువ ఉండేది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేశ్, వర్షిణి జంటగా నటించగా ఎస్ ఎస్ రాజేష్ సంగీతం అందించారు. నిర్మాత భాద్యతలు కూడా రవిబాబు తీసుకున్నారు.
సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

