న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, ఈ సినిమా నుండి ఇటీవల ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. కానీ, ఈ సినిమాను మార్చి 26న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ గట్టిగా ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, తొలి సింగిల్ లేదా టీజర్‌ను దేశ-విదేశాల మీడియాను పిలిచి ఒక భారీ ఈవెంట్లో విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో చిన్నపాటి విభేదాలు ఉన్నాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
అనిరుధ్ సంగీతం ఈ చిత్రానికి పెద్ద క్రేజ్ తీసుకురావాల్సి ఉంది. అయితే ఆయన వచ్చే నెల చాలా బిజీగా ఉండటంతో, ప్యారడైజ్ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తారా అన్నది ఆసక్తిని పెంచుతోంది. అన్ని రూమర్లకు బ్రేక్ వేయాలంటే, మూవీ టీమ్ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ రావాల్సిందే.


