ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏమిటి?
ఈ కథని ఒక ప్రేక్షకుడిగా విన్నాను. స్టొరీ చెప్పగానే ఫ్యాన్స్ కి కనెక్ట్ అయిపోయాను. ఇందులో చాలా అద్భుతమైన ఎమోషన్ ఉంది. అందరి జీవితంలో ఇలాంటి ఎమోషన్ ఉంటుంది. అది నాకు ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యింది.
సూపర్ స్టార్ సూర్య క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
ఒక స్టార్ జీవితం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఫ్యాన్స్ క్రేజ్, అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. హ్యూమన్ ఎమోషన్స్, ప్రేమ, రిచ్ పూర్ కి మధ్య ఉండే ఒక సంఘర్షణ ఎలివేషన్స్ అన్ని కమర్షియల్ యాంగిల్ లో చేసిన సినిమా ఇది. అవన్నీ సినిమాకి అద్భుతంగా కలిసి వచ్చాయి. ఒక స్టార్ కి అభిమానికి మధ్య ఉండే ఎమోషన్ ని చాలా అద్భుతంగా చెప్పారు.
మీ ఫస్ట్ డే ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ గురించి?
నేను చేసిన ‘A’ సినిమా డే ఫస్ట్ థియేటర్ కి వెళ్ళా, అయితే ఆడియన్స్ అందరూ సినిమా చూడకుండా నా కోసం బయటికి వచ్చేశారు. అసలు అది డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమా. ఆడియన్స్ సినిమా మిస్ అవుతారనే ఫీలింగ్ కలిగింది. అప్పటినుంచి థియేటర్ కి వెళ్ళడం ఆపేశాను.
రామ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
రామ్ గారు ఎక్స్ట్రాడినరి ఎనర్జిటిక్ పెర్ఫార్మర్. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆయన యాక్షన్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. ఆ సీన్ మీరు చూసినప్పుడే మీరే చెప్తారు. ఆయన రియల్ గా ఒక ఫ్యాన్ లాగా నటించారు. ఒక స్టార్ అయి ఉండి అలా నటించడం అంత ఈజీ కాదు. ఒక అభిమానిలో ఉండే అమాయకత్వం ఎనర్జీ మాస్ అన్ని అద్భుతంగా కనిపించాయి. ఒక స్టార్ కి అభిమానికి మధ్య ఉండే కనెక్షన్ డివైన్. అలాంటి ఒక ఎమోషన్ ని ఆయన పండించిన విధానం అద్భుతం .
భాగ్యశ్రీ గారితో మీకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా?
ఉన్నాయి. ఇందులో రామ్ గారు భాగ్యశ్రీ గారి మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్క్ అయింది. ఒక రెట్రో ఫీలింగ్ ని కలిగించే ఆ లవ్ స్టోరీ హార్ట్ టచ్చింగ్ గా ఉంటుంది. నేటివిటీని అద్భుతంగా తీసుకువచ్చారు.డైరెక్టర్ గారికి హ్యాట్సాఫ్ చెప్పాలి.చిన్న చిన్న డీటెయిల్స్ మీద చాలా చక్కని వర్క్ చేశారు.
మీ డైరెక్షన్లో కొత్త సినిమా ఎప్పుడు ఉంటుంది?
కొన్ని కథల మీద వర్క్ జరుగుతుంది. మంచిది ఫైనల్ అయితే అనౌన్స్ చేస్తాను.


