బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లతో ‘రాజు వెడ్స్ రాంబాయి’

బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లతో ‘రాజు వెడ్స్ రాంబాయి’

Published on Nov 25, 2025 3:09 PM IST

Raju-weds-rambhi

లేటెస్ట్ గా మన టాలీవుడ్ దగ్గర రిలీజ్ కి బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న సూపర్ హిట్ చిత్రమే రాజు వెడ్స్ రాంబాయి. యువ నటీనటులు అఖిల్ రాజ్ ఉద్దెమరి, తేజస్వీ రావు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సాయిలు కంపాటి తెరకెక్కించారు. యదార్ధ ఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ రూరల్ లవ్ స్టోరీ యువతని ఆకట్టుకొని సాలిడ్ వసూళ్లు రాబడుతుంది.

అయితే ఈ సినిమా మొత్తం 4 రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ నాలుగో రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా కేవలం ఇండియా వరకే ఈ సినిమా మొత్తం 9 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకుందట. ఇలా మంచి లాభాలతో సినిమా దూసుకెళ్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందించగా వేణు ఉడుగుల నిర్మాణం వహించారు. అలాగే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ వారు సహకారం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు