ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ లలో దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యిన స్ట్రేంజర్ థింగ్స్ కూడా ఒకటి. సక్సెస్ ఫుల్ గా 4 సీజన్స్ తర్వాత ఇప్పుడు 5వ సీజన్ పై భారీ హైప్ నెలకొంది. మొత్తం మూడు భాగాలుగా ఈ సీజన్ 5 ని రిలీజ్ చేస్తుండగా మన దేశంలో కూడా ఈ సిరీస్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే మేకర్స్ కూడా పాన్ ఇండియా భాషల్లో ఈ సిరీస్ ని తీసుకొస్తున్నారు.
ఇక ఈ సిరీస్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఎగ్జాక్ట్ టైం ఇప్పుడు రివీల్ అయ్యింది. ఈ నవంబర్ 27 అర్ధ రాత్రి 12 గంటల నుంచి కాకుండా 27 తెల్లవారు జాము 6 గంటల 30 నిమిషాల నుంచి ఈ సీజన్ ని తీసుకొస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ కన్ఫర్మ్ చేసింది. సో ఈ సీజన్ అభిమానులు అర్ధ రాత్రి వరకు వేచి చూడాల్సిన పని లేదు. ఇక ఈ సీజన్ లో మొత్తం మూడు లేదా నాలుగు ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. ఇక ఈ సీజన్ ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి.


