లెజెండరీ నటుడు ధర్మేంద్ర మృతి.. టాలీవుడ్ తారల ఘన నివాళి!

లెజెండరీ నటుడు ధర్మేంద్ర మృతి.. టాలీవుడ్ తారల ఘన నివాళి!

Published on Nov 24, 2025 5:05 PM IST

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో యావత్ ఇండియన్ సినిమా ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ‘హీ మ్యాన్’ ఇక లేరు అనే వార్తతో అభిమానులు తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయారు. ఇక ఆయన భౌతికకంగా తమ మధ్య లేకపోయినా, ఆయన సినిమాల్లో ఎప్పటికీ ఉండిపోతారని బాలీవుడ్ ప్రముఖులు తమ విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, ధర్మేంద్ర మృతిపై టాలీవుడ్ కూడా విషాదంలోకి వెళ్లింది. ఈ విషాద వార్త తెలుసుకున్న పలువురు టాలీవుడ్ సెలెబ్రిటీలు ధర్మేంద్రకు తమ నివాళులు అర్పిస్తున్నారు. ఎక్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, మోహన్ బాబు, అల్లు అర్జున్, రవితేజ లాంటి స్టార్స్ ధర్మేంద్ర మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. భారత సినీ చరిత్రలో ఓ యుగం ముగిసిందని వారు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

తాజా వార్తలు