ఐదు నెలల్లోనే షూట్ ను పూర్తి చేసిన పూరి !

ఐదు నెలల్లోనే షూట్ ను పూర్తి చేసిన పూరి !

Published on Nov 24, 2025 3:02 PM IST

Puri-Jagannadh-Vijay-Sethup

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా వస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు టీమ్‌ తెలిపింది. ‘‘ఎన్నో నెలల ప్రయాణం. ఎన్నో భావోద్వేగమైన క్షణాలు. మరెన్నో ఆనందకరమైన అనుభవాలతో ఈ సినిమా షూటింగ్‌ ముగిసింది. త్వరలోనే వరుస అప్‌డేట్స్ రాబోతున్నాయి. అందరూ వేచి ఉండండి’’ అంటూ ఒక ఫన్నీ వీడియోను నిర్మాణసంస్థ పోస్ట్ చేసింది.

కాగా జులై మొదటివారంలో ఈ సినిమా షూటింగ్‌ ను స్టార్ట్ చేసారు. కేవలం ఐదు నెలల్లోనే షూట్ ను కంప్లీట్‌ చేసేశారు. ఈ సినిమాలో సంయుక్త కథనాయికగా నటించారు. టబు, విజయ్‌ కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. విజయ్‌ సేతుపతి ఇందులో మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి ‘బెగ్గర్‌’ అనే టైటిల్‌ ను పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు