రెబల్ సాంగ్: ‘మిర్చి’తో ఆగిపోయిన ప్రభాస్ తిరిగొచ్చాడు

రెబల్ సాంగ్: ‘మిర్చి’తో ఆగిపోయిన ప్రభాస్ తిరిగొచ్చాడు

Published on Nov 23, 2025 9:13 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమాలలో ఒకటే “ది రాజా సాబ్”. దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ ఎట్టకేలకి చాలా ఆలస్యం తర్వాత ఆన్లైన్ లో విడుదల అయ్యింది. అయితే ఈ సాంగ్ మాత్రం పక్కా ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక ఫీస్ట్ అనే చెప్పాలి.

కేవలం సాంగ్ పరంగానే కాకుండా ఎన్నో ఏళ్ళు నుంచి మిస్ అవుతున్న ప్రభాస్ ఎనర్జీని మళ్ళీ ఈ సాంగ్ లో మేకర్స్ చూపించారు. ప్రభాస్ అంటే మంచి యాక్షన్ అనే అనుకుంటారు చాలా మంది, కానీ తనలోని ఒక సాలిడ్ డాన్సర్ ఉన్నాడని వింటేజ్ రెబల్స్ కి మాత్రమే తెలుసు. అలాంటి ప్రభాస్ దాదాపు మిర్చి సినిమాతోనే ఆగిపోయాడు. మంచి బాడీ లాంగ్వేజ్ తో ప్రభాస్ చేసే స్టెప్పులు మంచి గ్రేస్ గా ఉంటాయి.

మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అలాంటి డాన్స్ మూమెంట్స్ ఈ సాంగ్ లో కనిపించాయి. ఇవి మాత్రం డెఫినెట్ గా ఎప్పటి నుంచో ప్రభాస్ ని ఆరాధిస్తున్న అభిమానులకి ట్రీట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సాంగ్ ని కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేశారు. మంచి కలర్ ఫుల్ విజువల్స్ తో ఆసక్తికర సాహిత్యం ఇందులో ఉంది. ప్రభాస్ పెళ్లి కోసం తనకి వచ్చే అమ్మాయి ఎక్కడ ఉంది? ఎక్కడో డాబాపై వడియాలు ఆరబెడుతుందా అనే లాంటివి మంచి ఫన్ గా ఉన్నాయి.

అలానే పాన్ ఇండియా నెంబర్ 1 అనే దానికి తానే ఆ నెంబర్ 1 బ్యాచిలర్ అంటూ సెట్ చేయడం మేకర్స్, సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి క్రియేటివిటీ చూపిస్తుంది. అలాగే మధ్యలో ఫ్యామిలీ టచ్ ఇవ్వడం కూడా బాగుంది. మొత్తానికి మాత్రం ఒక కంప్లీట్ బ్యాంగర్ సాంగ్ ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు వదిలారు.

తాజా వార్తలు