ఓటీటీ: కామెడీ ఎంటర్‌టైనర్ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ స్ట్రీమింగ్‌కి రెడీ! ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

ఓటీటీ: కామెడీ ఎంటర్‌టైనర్ ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ స్ట్రీమింగ్‌కి రెడీ! ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Published on Nov 21, 2025 7:00 PM IST

ఇటీవల థియేటర్లలో విడుదలైన తెలుగు కామెడీ చిత్రం ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’. నవంబర్ 7, 2025న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా, విడుదలయ్యాక ప్రేక్షకులను బాగా నవ్వించి డీసెంట్ రెస్పాన్స్ సంపాదించుకుంది.

రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తిరువీర్, టీనా శ్రావ్య ప్రధాన పాత్రలు పోషించారు. వారిద్దరి కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ను జీ5 (ZEE5) ఖరారు చేసింది. ‘ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో’ చిత్రం డిసెంబర్ 5, 2025 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో ఈ చిత్రం ఎలాంటి పర్ఫార్మెన్స్ చూపిస్తుందో చూడాలి.

ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్ వంటి ఇతర నటీనటులు కూడా కీలక పాత్రల్లో నటించి కథకు మరింత బలాన్ని చేకూర్చారు. ఈ సినిమాను సందీప్ అగరం మరియు అష్మిత రెడ్డి బాసాని సంయుక్తంగా నిర్మించగా, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

తాజా వార్తలు